
క్రమశిక్షణ,నైపుణ్యంగల యువతను అందించడం ద్వారా దేశ నిర్మాణంలో, ఆర్మీ సేవల్లో యూత్ ఫ్రొఫైల్ ను కొనసాగించేందుకు అగ్నిపథ్ స్కీం అమలు సంస్క రణల్లో భాగమని చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ అన్నారు. టెక్నాలజీ స్కిల్స్ ఉన్న సీఫైటర్స్ గా మారేందుకు దృష్టి పెట్టాలని అగ్నివీర్లకు సూచించారు.
నౌకదళంలో అగ్నివీర్ శిక్షణ కార్యక్రమంలో సీడీఎస్ మాట్లాడుతూ నౌకాదళంలో ఉన్నత ప్రమాణాలతో కూడిన శిక్షణను అందించి, సముద్ర యోధులను తీర్చిది ద్దు తు న్నందుకు నేవీని అభినందించారు.
2022లో మూడు సర్వీసుల వయస్సు ప్రొఫైల్ ను తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వం స్వల్పకాలిక సిబ్బందిని చేర్చుకోవడం కోసం అగ్నిపథ్ రిక్రూట్ మెంట్ ను నిర్వహిస్తుందన్నారు. అగ్ని పథ్ స్కీం 17 ఏళ్ల నుంచి 21 ఏళ్ల వయసున్న యువకులను నాలుగు సంవత్సరాలకు రిక్రూట్ చేసుకుంటుంది. వారిలో 25 శాతం మందిని మరో 15 ఏళ్లకు కొనసాగించే అవకాశం ఉంటుంది.